హైదరాబాద్: 28°C
వార్తలు

కొనసాగుతున్న సీజేపీ నిరసన

ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన కొనసాగుతోంది. 36 రోజులుగా సీజేపీ ఆందోళన చేస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టింది. నిరసనల నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 2 కి.మీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.