హైదరాబాద్: 28°C
వార్తలు

దుర్గమ్మకు ఆకుకూరలు పండ్లతో అలంకరణ

AKP: నర్సీపట్నంలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శాకాంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తొలి ఏకాదశిని పురస్కరించుకుని దుర్గాదేవిని ఆకుకూరలు, పలు రకాల పండ్లతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.