హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్'

ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. శనివారం మంగమూరు రోడ్డులో గల తమ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మొత్తం 30 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే సిబ్బంది తెలిపారు.