హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ పేరుతో వీడియోలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్

ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులను ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఆర్మీ అధికారులు బెదిరిస్తున్నట్లు SMలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అవన్నీ నకిలీ వీడియోలని స్పష్టం చేసింది. ఏఐతో సృష్టించారని వెల్లడించింది. ఆ నకిలీ వీడియోలలో చూపినట్లు ప్రధాని గానీ, కేంద్రమంత్రులు గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది.