హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కాంగ్రెస్ నేతల కొవ్వొత్తుల ర్యాలీ

TG: హైదరాబాద్‌లో సాయంత్రం 6:30 గంటలకు కాంగ్రెస్ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి, కేంద్రం తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టనున్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ పాల్గొననున్నారు.