హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర కేబినెట్ ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం

ATP: జిల్లాలోని గుంతకల్- బళ్లారి మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రూ.1,264 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా మెరుగై స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.