GNTR: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలిలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ అనుపమ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వార్తలు
'తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో భక్తుల రద్దీ'


