హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: 39కి చేరిన కరోనా కేసులు

AP: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతుంది. నిన్న మరో 7 కేసులు నమోదయ్యాయి. తూ.గో జిల్లాలో 5, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో ఒక్కో కేసు బయటపడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 266 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. వైరస్ బాధితుల్లో నలుగురు మరణించగా 30 మంది చికిత్స పొందుతున్నారు. ఐదుగురు కోలుకున్నారు.