హైదరాబాద్: 28°C
వార్తలు

సోలార్ ప్లేట్ల చోరీ కేసులో ట్విస్ట్!

PLD: బెల్లంకొండ మండలం కందిపాడు పొలాల్లో సోలార్ ప్లేట్లను దొంగిలించిన కేసులో భాగం ఉదయ్ కిరణ్, బండారు వెంకటేశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సత్తెనపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ గోపి వెల్లడించారు. రైతుల పొలాల్లో సోలార్ పరికరాలు, సామాగ్రి చోరీకి పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.