ASR: డుంబ్రిగూడ ఏకలవ్య పాఠశాల ఎదురుగా శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శీలంగొంది గ్రామానికి చెందిన వంతాల స్వామి గాయపడ్డాడు. ఆటోలో శీలంగొందికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్కలు అడ్డుగా రావడంతో ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన స్వామిని చికిత్స అందించి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు


