హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీబీవీ విద్యార్థినులకు షీటీం అవగాహన

BHPL: రేగొండ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో షీటీం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై ఫజల్ ఖాన్ గుడ్ టచ్-బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచితుల ఫోన్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-100, సైబర్ మోసాల కోసం 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.