హైదరాబాద్: 28°C
వార్తలు

'పట్నం' ఫ్యామిలీలో తీవ్ర విషాదం

NRPT: పట్నం ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. పట్నం సోదరులైన మహేందర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాతృమూర్తి రుక్కమ్మ (95) కొద్దిరోజులుగా అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రుక్కమ్మ అంత్యక్రియలు స్వగ్రామం షాబాద్ మండలం గొల్లూరుగూడలో శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల ఉమ్మడి జిల్లా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.