హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జోగులాంబలో వైభవంగా రథోత్సవం

GDWL: అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో జోగులాంబ అమ్మవారి రథోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తిని పల్లకిలో తీసుకొచ్చి రథంపై ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు. అనంతరం మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.