హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి అమర్‌నాథ్ యాత్ర పున:ప్రారంభం

అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్‌కు భక్తుల యాత్ర రేపటి నుంచి పున:ప్రారంభం కానుంది. జమ్మూలోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాన్ బేస్ క్యాంప్‌కు దాదాపు 5 వేల మంది భక్తులు తరలివెళ్తారని అధికారులు తెలిపారు. యాత్ర దృష్ట్యా పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు.