హైదరాబాద్: 28°C
వార్తలు

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సాయిబాబు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాలు, డయల్-100, 1930 సైబర్ హెల్ప్‌లైన్ వినియోగంపై అవగాహన కల్పించారు.