హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నిమిషాల్లో యూరియా ఖాళీ

MDK: చిన్నశంకరంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి కేటాయించిన 555 యూరియా బస్తాలను రైతులు యాప్ ద్వారా కేవలం మూడున్నర నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు. రైతుల నుండి అనూహ్య స్పందన రావడంతో బుకింగ్ క్షణాల్లో పూర్తయిందని సీఈవో రమేష్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు సొసైటీ వద్ద రూ. 300 చెల్లించి ఎరువులు తీసుకెళ్లాలని కోరారు.