హైదరాబాద్: 28°C
వార్తలు

గుర్తూరులో గుంజేడు ముసలమ్మ జాతర

MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో గుంజేడు ముసలమ్మ తల్లి జాతర కన్నుల పండుగగా జరుపుకున్నారు. మహిళలు బోనాలను డప్పు చప్పుళ్ళ నడుమ ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. ముసలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కుకున్నట్లు తెలిపారు.