హైదరాబాద్: 28°C
వార్తలు

గంగమ్మ ఆలయంలో చోరీ

నంద్యాల శివారులోని గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. హుండీలోని సుమారు రూ.15 వేల నగదుతో పాటు అమ్మవారి విలువైన చీరలను అపహరించినట్లు ఆలయ నిర్వాహకుడు తెలిపారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.