హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదర్శనీయంగా నిలిచిన యువత

SKLM: ఆమదాలవలస మండలం తొగరం పంచాయతీ పరిధిలోని దిబ్బలపేట గ్రామంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వాగ్దేవి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ సిహెచ్. ప్రవీణ్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొని రక్తదానం చేశారు. సామాజిక సేవలో యువత ముందుండాలని డా. దానేటి శ్రీధర్, రోటరీ క్లబ్ ప్రతినిధులు అన్నారు.