హైదరాబాద్: 28°C
వార్తలు

చౌడేశ్వరి దేవి అమ్మవారి హుండీ లెక్కింపు

NDL: బనగానపల్లె (మం) నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ కార్యనిర్వాహన అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుండీ లెక్కింపులో రూ.34, 65,512 నగదు, 49 గ్రాముల బంగారం, ఒక కేజీ 49 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.