BPT: వెదుళ్ళపల్లిలో బధిరుల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హర్షం వ్యక్తం చేశారు. 'ఇంద్రధనస్సు' పథకంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ కళాశాల మంజూరు చేయడం గర్వకారణ మన్నారు. బధిరుల ఉన్నత విద్యా కల నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల, కళాశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు.
వార్తలు
'బధిరుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చారిత్రాత్మకం'


