హైదరాబాద్: 28°C
వార్తలు

బమ్మెర ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ

JN: పాలకుర్తి మండలం బమ్మెరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జనకిరామ్‌రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి,అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఏసీపీ సూచించారు.