BPT: చుండూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే ఆనంద బాబు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువు, హాజరు, పరీక్షల ఫలితాలపై సమీక్షించారు. తల్లికి వందనం పథకం వరుసగా రెండో ఏడాది అమలవుతోందని తెలిపారు. ప్రతి అర్హ విద్యార్థికి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.
వార్తలు
చుండూరులో మెగా పీటీఎం నిర్వహణ


