హైదరాబాద్: 28°C
వార్తలు

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఉండాలి: కలెక్టర్

ATP: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. అనంతపురం పాత ఆర్డీవో కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా భద్రతా చర్యలను, లాగ్ బుక్‌లను పరిశీలించారు. ఈవీఎం కేంద్రాల వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.