హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. 13 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా ప్రాంతంలో టాటాసుమో లోయలో పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.