హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో దాడి చేశారు: రాహుల్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై భద్రతా బలగాలు పెల్లెట్ గన్లు, లాఠీఛార్జ్ ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తప్పబట్టారు. పోలీసుల దమనకాండలో 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించారు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని నిరసన చేస్తున్న సాహిల్ అనే విద్యార్థిపై పెల్లెట్ గన్‌ కాల్పులు జరపడంపై మండిపడ్డారు. అవి తగలడం వల్ల అతని కన్ను దెబ్బతిందన్నారు.