హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ASR: జిల్లాలోని జీసీసీ, ఐటీడీఏ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అమర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కార్మికులతో కలిసి పాడేరులో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు.