హైదరాబాద్: 28°C
వార్తలు

హనుమకొండలో ఎస్ఎఫ్ఐ ధర్నా..!

HNK: నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యలను నిరసిస్తూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండలో విద్యాసంస్థల బంద్ నిర్వహించి ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేసి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.