హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి'

KRNL: పత్తికొండలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా బైక్ ర్యాలీ, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండించారు.