హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో మరో పేపర్ లీక్‌.. బీజేపీ నిరసన

నీట్ పేపర్ లీక్ అంశంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ కేరళంలో మరో పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై బీజేపీ యువమోర్చా తీవ్ర నిరసన చేపట్టింది. తిరువనంతపురంలో సీఎం అధికారిక నివాసం వద్ద యువమోర్చా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.