హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ చట్టసవరణ బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆ బిల్లును పొందుపరచనున్నారు. నిందితులకు పదేళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.