హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కనీస వేతనాలు పెంచాలని డిమాండ్

GNTR: కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జులై 30, 31 తేదీల్లో నిర్వహించనున్న 'ఛలో కలెక్టరేట్'ను జయప్రదం చేయాలని తుళ్లూరులో శుక్రవారం ప్రచార జాతర చేపట్టారు. స్థానిక లైబ్రరీ సెంటర్ వద్ద నాయకులు నినాదాలు చేసి మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వేతనాలు పెంచకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.