AKP: కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని పరవాడ ఫార్మసిటీ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి విమర్శించారు. కార్మికులకు గత ఎన్నో ఏళ్ల నుంచి వేతనాలు పెరగలేదని, కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. సమస్యలపై ఈనెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పరవాడ ఫార్మసిటీ వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు.
వార్తలు
'శ్రమను దోచుకుంటున్న యాజమాన్యాలు'


