హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభలో వందేమాతరం బిల్లు.. వాయిదా

రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. జాతీయ గేయం వందేమాతరం బిల్లును రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం వందేమాతరంను ఇకపై అవమానిస్తే నేరంగా పరిగణిస్తారు. అంతేకాకుండా వందేమాతరం ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగానే పరిగణించేలా చట్టాన్ని బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లుపై విపక్ష సభ్యుల నినాదాలతో రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ రాధాకృష్ణన్ ప్రకటించారు.