హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ దిష్టి బొమ్మ దహనానికి యత్నం

PLD: నరసరావుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనానికి యత్నించిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్‌తో పాటు ప్రజాసంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.