హైదరాబాద్: 28°C
వార్తలు

'పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులకు చెక్'

WNP: పెబ్బేరు మున్సిపాలిటీ 5వ వార్డులో నిర్వహించిన 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు నీటి నిల్వలను ఖాళీ చేసి పారిశుధ్య చర్యలకు సహకరించాలని కోరారు.