హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: ఆదోని శివారులోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే డా. పార్థసారథి పాల్గొన్నారు. విద్యార్థినుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాదని పేర్కొంటూ, తల్లిదండ్రులు పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు.