హైదరాబాద్: 28°C
వార్తలు

బోథ్‌లో విద్యాసంస్థల బంద్ విజయవంతం: AISF

ADB: ఏఐఎస్‌ఎఫ్ పిలుపు మేరకు బోథ్ మండలంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని AISF మండల అధ్యక్షుడు మున్సిఫ్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అన్నారు. లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కోరారు.