GNTR: ప్రత్తిపాడు గ్రామంలో శుక్రవారం మహిళలు వర్షాలు కురవాలని గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. బావి నుంచి నీటిని బిందెలలో తీసుకొచ్చి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: గంగానమ్మకు మహిళల జలాభిషేకం


