హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరు ఈస్ట్ ఎస్‌డీపీవోగా సీతారామ్

GNTR: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీవో)గా టీ. సీతారామ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.