MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్లపల్లిలో చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కార్డాన్ సెర్చ్ చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 2 లీటర్ల గుడుంబాను పట్టుకుని, 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకే తనిఖీలు చేపట్టామని తెలిపారు.
వార్తలు
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకే కార్డాన్ సెర్చ్


