హైదరాబాద్: 28°C
వార్తలు

ఆందోళనకారుల పాస్‌పోర్టులు రద్దు అవాస్తవం..!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న ఆందోళనకారుల పాస్‌పోర్టులు రద్దు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. నిరసనలు తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుడు వార్తలు మరిన్ని ప్రచారంలోకి వస్తాయని, వాటిని నమ్మొద్దని కోరారు. పాస్‌పోర్టులు రద్దు చేసే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.