హైదరాబాద్: 28°C
వార్తలు

రహదారిపై వరినాట్లు వేసి గ్రామస్థుల వినూత్న నిరసన

MDK: నిజాంపేట మండలం చల్మెడ గ్రామ రహదారిపై అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా స్థానిక వార్డు సభ్యులు, ప్రజలు బురదలో వరినాట్లు వేసి తమ నిరసన తెలిపారు. రహదారికి కంకర పోసి ఏండ్లు గడుస్తున్నా నేటికీ డాంబర్ వేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.