హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ ఫైర్

విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న యువతకు మోదీ ప్రభుత్వం తీవ్రమైన క్రూరత్వంతో సమాధానమిస్తోందని ధ్వజమెత్తారు. విద్యార్థులను శత్రువులుగా పరిగణిస్తూ వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. విద్యా రంగాన్ని దిగజార్చడం మోదీ ప్రభత్వం అలవాటుగా చేసుకుందని ఫైర్ అయ్యారు.