అన్నమయ్య: పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన అలంకరణలు తల్లిదండ్రులను, చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ఎంట్రెన్స్ వద్ద అరటి ఆకులు, తోరణాలు కట్టి, రంగురంగుల ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు. సమావేశానికి వచ్చే తల్లిదండ్రులకు ఆత్మీయంగా స్వాగతం పలికేలా ఉపాధ్యాయులు ఈ ఏర్పాట్లు చేశారు.
వార్తలు
ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ


