హైదరాబాద్: 28°C
వార్తలు

పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ

KNR: గ్రూప్స్, RRB, SSC, బ్యాంకింగ్, పోలీస్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు KNR బీసీ స్టడీ సర్కిల్ 125 రోజుల ఉచిత కోచింగ్ అందించనుంది. KNR, JGL, PDPL, జిల్లాలకు చెందిన అర్హులు ఆగస్టు 14లోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ డా. రవి కుమార్ తెలిపారు. ఎంపికైన వారికి నిపుణుల ద్వారా శిక్షణ, పరీక్షా మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు.