ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలో వందలమంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, నీట్ అంశంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
వార్తలు
ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు


