ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన సందర్భంగా, హైస్కూల్ కనకదుర్గమ్మ తల్లి ఆలయం నుంచి గంగానమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. సుమారు 108 మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని, బోనాలతో పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ విశేష వేడుకతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
వార్తలు
గంగానమ్మ తల్లికి బోనాల సమర్పణ


