E.G: కొబ్బరికాయల ఒలుపునకు సంబంధించి ధరల విషయంలో అటు కార్మిక సంఘాలు, ఇటు రైతులు, వర్తకుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఒప్పందంలో కుదిరిన ధరలు రెండేళ్ల పాటు అమల్లో ఉండనున్నాయి. స్థానికంగా జరిగిన ఈ చర్చల్లో ఆగస్టు 1 నుంచి ఆమోదం తెలిపిన ధరలకు కాయలను ఒలిచేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులు ఒప్పుకొన్నారు. ఈ చర్చల్లో పలు గ్రామాల కార్మిక, రైతు, వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
'కొబ్బరికాయల ఒలుపు ధరల ఒప్పందంపై చర్చలు సఫలం'


