ఢిల్లీలో ఇవాళ కూడా 17 మెట్రో స్టేషన్లను మూసివేశారు. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మెట్రో స్టేషన్లు బంద్ కానున్నట్లు ప్రకటించారు. కాగా, ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేయడం వరుసగా ఇది మూడో రోజు కావడం గమనార్హం. మెట్రో నడవకపోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వార్తలు
ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్లు మూసివేత


